- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రేమ పేరుతో మాయమాటలు.. బాలిక పై లైంగిక దాడి…
దిశ, ఖైరతాబాద్ : ప్రేమిస్తున్నానని బాలికను నమ్మించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డ యువకుడి పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని ఓ బస్తీలో నివాసం ఉంటున్న బాలిక (15) ఓ స్కూల్ లో పదో తరగతి చదువుతోంది. ఆమె నివాసం ఉంటున్న ఇంటి యజమాని కొడుకు హబీబ్ (24) బాలికను ప్రేమిస్తున్నానని చెప్పి నమ్మించాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె గదిలోకి వచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
విషయాన్ని గమనించిన బాలిక తండ్రి ఈ విషయం పై హబీబ్ కుటుంబ సభ్యు లను నిలదీయగా తమకేమీ సంబంధం లేదని చేతులు దులుపుకున్నారు. హాబీబును పిలిపించి గట్టిగా ప్రశ్నించగా తాను బాలికను ఏమి చేయలేదని, ఆమెను సోదరిలా చూస్తున్నానని బుకాయించాడు. కాగా ఏడాది నుంచి తన పై పలుమార్లు లైంగికదాడి చేశాడని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బుధవారం బాలిక తల్లి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హబీబ్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.