జీహెచ్ఎంసీని మూడు ముక్కలుగా విభజించాలని సర్కారు నిర్ణయం?

by Anjali |
జీహెచ్ఎంసీని మూడు ముక్కలుగా విభజించాలని సర్కారు నిర్ణయం?
X

దిశ, సిటీ బ్యూరో: పరిపాలన సౌలభ్యం కోసం జీహెచ్ఎంసీని మూడు ముక్కలుగా విభజించాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం 150 డివిజన్లతో ఉన్న జీహెచ్ఎంసీలోకి శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కలుపుకుని మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు జీహెచ్ఎంసీ అధికారవర్గాల ద్వారా తెలిసింది. శుక్రవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా శాంతిభధ్రతలు, విపత్తుల నివారణ కోసం మూడు కార్పొరేషన్లు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ చుట్టున్న ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, కంటోన్మెంట్ బోర్డు ఏరియా పరిధి, అలాగే 20 మున్సిపాలిటీలు, మరో 33 గ్రామ పంచాయతీలను కలుపుకుని మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించాలని భావిస్తున్నట్లు సమాచారం.

అయితే ఇప్పటికే కంటో న్మెంట్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, విలీన ప్రక్రియ వేగవంతం కావడం కూడా ఈ విభజన ప్రక్రియకు మరింత బలాన్ని చేకూరుస్తున్నదని జీహెచ్ఎంసీ అధికార వర్గాల ద్వారా తెలిసింది. మొత్తం 170 నుంచి 189 డివిజన్లుగా ఏర్పాటు చేసి, ఒక్కో కార్పొరేషన్ పరిధిలోకి 60 డివిజన్లు వచ్చేలా విభజించే యోచినట్లు సమాచారం. ప్రస్తుతమున్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల మాదిరిగానే ఈ మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే పరిపాలన, శాంతి భద్రతల పరిరక్షణతోపాటు పౌర సేవల నిర్వహణ సులభతరం అవుతుందని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. ఈ మూడు పోలీసు కమిషనరేట్ల పరిధితోనే మూడు మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటుపై కసరత్తు కొనసాగుతున్నట్లు సమాచారం. ఒక్కో కార్పొరేషన్‌కు ఓ ఎస్పీ స్థాయి అధికారి హైడ్రా తరఫున సేవలందించేలా ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed