అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న నలుగురి రిమాండ్

by Sridhar Babu |   ( Updated:2024-01-02 14:37:07.0  )
అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న నలుగురి రిమాండ్
X

దిశ, చంపాపేట్ : అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న నలుగురు నిందితులను కంచన్ బాగ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 31.34 కేజీల గంజాయి, కారు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్​కు తరలించారు. కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సౌత్, ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ డి.మనోహర్, కంచన్ బాగ్ ఇన్స్పెక్టర్ జి.శేఖర్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్. సైదాబాబుతో కలిసి నిందితుల వివరాలను వెల్లడించారు. వట్టిపల్లి గుంతల్ బాబా దర్గా ప్రాంతానికి చెందిన షేక్ అబ్దుల్ ఫైనల్ (36), ఆసిఫ్ నగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ సమీవుద్దీన్ (32), శాస్త్రిపురం ప్రాంతానికి చెందిన

మహ్మద్ అమీర్ (28), శాస్త్రిపురానికి చెందిన హుస్నా ఫాతిమా అలియాస్ సాజిదా తబస్సుం (28) కలిసి గత కొన్ని రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని రవాణా చేస్తూ నగరంలో అవసరమైన వారికి అధిక డబ్బులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకోవాలని ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా వీరంతా నూతన సంవత్సరం 2024ను పురస్కరించుకొని ఒడిశా రాష్ట్రానికి చెందిన రితేష్ వద్ద 15 ప్యాకెట్ల (ఒక్క ప్యాకెట్ 2 కేజీలు) గంజాయిని రూ.56 వేలకు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన గంజాయిని కారు డిక్కీలో హైదరాబాద్ నగరం నుంచి పిసల్బాండ ఎక్స్ రోడ్డు ద్వారా తరలిస్తున్నారు. దీనిపై విశ్వసనీయమైన సమాచారం అందుకున్న

సౌత్, ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కంచన్ బాగ్ పోలీసులతో కలిసి సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కారులో గంజాయిని తరలిస్తున్న షేక్ అబ్దుల్ ఫైనల్, సమివుద్దీన్, మహ్మద్ అమీర్, హుస్నా పాతిమాలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 31.34 కేజీల గంజాయి, కారు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం కంచన్ బాగ్ పోలీసులకు అప్పగించారు. దీంతో కంచన్బాగ్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్​కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు లింగరాజు, పద్మయ్య, హిమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More..

మినిస్టీరియల్​స్టాఫ్​సేవలు ప్రశంసనీయం: డీజీపీ రవి గుప్తా

Advertisement

Next Story

Most Viewed