పబ్‌కు వెళ్లిన యువతితో నలుగురు అసభ్య ప్రవర్తన

by Mahesh |
పబ్‌కు వెళ్లిన యువతితో నలుగురు అసభ్య ప్రవర్తన
X

దిశ, శేరిలింగంపల్లి: స్నేహితులతో కలిసి సరదాగా పబ్‌కు వెళ్లిన యువతిపట్ల నలుగురు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కొండాపూర్ లోనిక్లబ్ రోప్ పబ్‌కు గతరాత్రి హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్న యువతి తన స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్లింది. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న నలుగురు యువకుల అమ్మాయి పట్ల దురుసుగా ప్రవర్తించడంతో ఇరువురి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. దీంతో యువతి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, యువకులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed