- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దాచుకోవడం, దోచుకోవడమే కేసీఆర్ పాలసీ : మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
దిశ, శేరిలింగంపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, వివేకానంద నగర్, కూకట్ పల్లి నాలుగు డివిజన్లకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ కార్యాలయం రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి, శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మిస్తున్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ.17 వేల కోట్లను అందించిందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు లబ్ధిదారులకు వాటిని అందించలేదని విమర్శించారు. ఎంత పేరు మార్చుకున్నా బీఆర్ఎస్ పార్టీని త్వరలోనే ప్రజలు తరిమికొడతారని అన్నారు. దాచుకోవడం, దోచుకోవడం తప్ప కేసీఆర్ చేసింది ఏమీ లేదని, ఇతర ప్రాంతం వాళ్లు తప్పు చేస్తే ఇక్కడి నుంచి వెళ్లగొట్టమన్న కేసీఆర్‌కు లక్షల కోట్లు మింగిన కేసీఆర్ ను ఈ ప్రాంతం వారే తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రానున్న ఎలక్షన్లలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రవాడం ఖాయమని, పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేస్తూ పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్క కార్యకర్త కోసం, నాయకుడి కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నూతన కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతీ రోజు కార్యకర్తలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఈ కార్యాలయాన్ని ప్రారంభించామని తెలియజేశారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా పని చేసినప్పుడు జరిగిన అభివృద్ధి తప్పా ఇప్పుడున్న ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, నవీన్ గౌడ్, నర్సింగరావు, కమలాకర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, కంటెస్టెడ్ కార్పొరేటర్ రవీందర్రావు, నర్సింగ్ యాదవ్, చారి, సీతారామరాజు, నాగులు గౌడ్, రామరాజు , కుమార్ యాదవ్, దేవిరెడ్డి, జ్యోతి, శ్రీలత, నవత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.