స్వచ్ఛ కార్మికులకు పాదపూజ

by Sridhar Babu |   ( Updated:2023-02-11 13:29:20.0  )

దిశ , బేగంపేట : జీహెచ్ఎంసీ కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శనివారం రాంగోపాల్ పేట డివిజన్ కార్పొరేటర్ చీరసుచిత్ర శ్రీకాంత్ స్వచ్ఛ కార్మికులతో సపంక్తి భోజనం ఏర్పాటు చేశారు. డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విచ్చేసి ముందుగా జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులను అభినందించారు. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య విభాగంలో అనేక సంవత్సరాలుగా విశేష సేవలు అందిస్తున్న ఐదుగురు కార్మికులను ఎంచుకొని వారికి డివిజన్ కార్పొరేటర్ చీరసుచిత్ర పాదపూజ నిర్వహించడంతోపాటు ప్రత్యేకంగా సన్మానించారు. అక్కడే ఉన్న కేంద్రమంత్రి వారితో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. అనంతరం ప్రత్యేకంగా వారికి భోజనం వడ్డించారు. వారి సేవలు ఎప్పటికి మరువలేనివని, హైదరాబాద్ లాంటి నగరం పరిశుభ్రంగా ఉంది అంటే దానికి కారణం నిత్యం మీరు చేస్తున్న సేవనే అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు.

భోజనంలో దాదాపు 750 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. చీర సుచిత్ర శ్రీకాంత్ ను అభినందించారు. గడిచిన రెండు సంవత్సరాలలో చేసిన అభివృద్ధి పనులతో రూపొందించిన బ్రోచర్ ను కేంద్రమంత్రి ఆవిష్కరించారు. డివిజన్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, జఠిలమైన సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంతరం కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ మాట్లాడుతూ గడిచిన రెండు సంవత్సరాల కాలంలో డివిజన్లో అనేక సమస్యలను పరిష్కరించానని ఆమె తెలిపారు. కార్యక్రమంలో మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ గౌడ్, రామ్ గోపాలపేట డివిజన్ బీజేపీ అధ్యక్షులు ఆకులప్రతాప్, నాయకులు ఎస్ఆర్ మల్లేష్, మనోజ్, అనిషా వర్మ, సాయి ముదిరాజ్, పాల్దాస్, అశ్వని అలోక యాదవ్, నిర్మల పాల్గొన్నారు.

Advertisement

Next Story