- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దీక్ష దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే తలసాని
దిశ, బేగంపేట : ఈ నెల 29 వ తేదీన తెలంగాణ భవన్ లో నిర్వహించే దీక్షా దివస్ కు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన కార్యాలయం వద్ద సనత్ నగర్ నియోజకవర్గ స్థాయి బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సాధకుడు, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిందని పేర్కొన్నారు. 29 తేదీన మధ్యాహ్నం గంటలకు నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ ల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు బైక్ లపై బేగంపేట లోని పాటిగడ్డ లో గల మల్టి పర్పస్ ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకోవాలని చెప్పారు.
సుమారు 3 వేల బైక్ లతో ర్యాలీ గా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సర్కిల్ వద్దకు చేరుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. అక్కడి నుండి ర్యాలీగా తెలంగాణ భవన్ కు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు. తెలంగాణ భవన్ లో జరిగే దీక్షా దివస్ లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుండి పార్టీ శ్రేణులు పాల్గొంటారని చెప్పారు. ఈ సమావేశంలో బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, గుర్రం పవన్ కుమార్ గౌడ్, ఆకుల హరికృష్ణ, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, హన్మంతరావు, మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున్ గౌడ్, నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, శ్రీహరి, ఏసూరి మహేష్, సంతోష్, ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఖలీల్, లక్ష్మీపతి, శేఖర్, శ్రీకాంత్ రెడ్డి, నాగులు, కిషోర్, సురేష్ గౌడ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.