అయ్యప్ప సొసైటీలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలు

by Sridhar Babu |
అయ్యప్ప సొసైటీలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలు
X

దిశ, శేరిలింగంపల్లి : మాదాపూర్ డివిజన్ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. నోడల్ ఆఫీసర్ సురేష్, ఏసీపీ మల్లిఖార్జున్ పర్యవేక్షణలో అయ్యప్ప సొసైటీలో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది మూడవ రోజు కూడా కూల్చివేతలు కొనసాగించారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా, సెట్ బ్యాక్ లు కూడా లేకుండా కడుతున్న

బిల్డర్లకు గతంలోనే హెచ్చరికలు జారీ చేసినా నిర్మాణాలు ఆపక పోవడంతో సోమవారం నుండి టీపీఎస్ సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు. బుధవారం ప్లాట్ నెంబర్ 762 తో పాటు ప్లాట్ నెంబర్ 835, 867లలో కొనసాగుతున్న నిర్మాణాలను కూల్చివేశారు. అయ్యప్ప సొసైటీలో జరుగుతున్న అక్రమ కట్టడాలపై ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇప్పటికే పలువురికి నోటీసులు కూడా ఇచ్చామని, రానున్న వారం రోజుల్లో మరిన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేయనున్నట్లు టీపీఎస్ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story