- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణం కూల్చివేత
దిశ, శేరిలింగంపల్లి ; శేరిలింగంపల్లి మండలంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి ఫోకస్ చేసింది. హైడ్రా ఉనికిలోకి వచ్చిన మొదట్లో శేరిలింగంపల్లి మండలం హఫీజ్ పేట్ వైశాలి నగర్ లో ఎఫ్టీఎల్ లో నిర్మించిన మూడు భవనాలను నేలకూల్చి సంచలనం సృష్టించింది. ఎఫ్టీఎల్ లో, బఫర్ జోన్ లో నిర్మాణాలు చేపట్టిన వారికి గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు తాజాగా శేరిలింగంపల్లి మండలంలో మరోసారి కూల్చివేత్తలు చేపట్టింది. ఈసారి ఎలాంటి సెట్ బ్యాక్ లు లేకుండా రోడ్డుకు ఆనుకుని ఉన్న నిర్మాణాన్ని తొలగించే పనిలో పడింది. శేరిలింగంపల్లి మండలం మాదాపూర్ డివిజన్ అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్డులో సుమారు 684 గజాల స్థలంలో ఓ నిర్మాణం కొనసాగుతుంది. దీనిపై గతంలో చందానగర్ జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదులు రాగా కొంతకాలం నిర్మాణం ఆగింది. అనంతరం మళ్లీ మొదలైంది. ఆ తర్వాత ఫిర్యాదు దారులు కోర్టుకు వెళ్లగా హైకోర్టు ఈ నిర్మాణాన్ని కూల్చాలంటూ ఆదేశాలు జారీచేసినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.
కానీ నిర్మాణదారులు మరోసారి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నట్లు తెలుస్తుంది. ఈ నిర్మాణం 100 ఫీట్ల రోడ్డుకు ఆనుకుని ఉండడంతో పలువురు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం అయ్యప్ప సొసైటీలోని ఈ నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ, ఇతర శాఖల అధికారులతో కలిసి పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ సదరు నిర్మాణదారుడి వద్ద అనుమతులు ఇతర పత్రాలను పరిశీలించారు. అలాగే గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా పునపరిశీలన చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ 100 ఫీట్ల రోడ్డులో ఉన్న భవనాన్ని కూల్చాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో శనివారం సాయంత్రం 3 డీఆర్ ఎఫ్ బృందాలు, కొన్ని వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. అయితే ఆ రూట్లో సీఎం వెళ్లనున్నారని, బందోబస్తుకు ఇబ్బంది ఎదురవుతుందని, వీకెండ్ కూడా కావడంతో ట్రాఫిక్ రద్దీ ఉండనున్న నేపథ్యంలో కూల్చివేతలు ఆదివారం ఉదయానికి వాయిదా వేశారు.
ఉదయం 10 గంటల నుండే కూల్చివేతలు
ఆదివారం ఉదయం అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్డుకు చేరుకున్న డీఆర్ ఎఫ్ సిబ్బంది ఆ బిల్డింగ్ దగ్గర ఉన్న సెక్యూరిటీ, ఇతర పని వాళ్ళను అక్కడి నుండి పంపించేసి, ఆరోడ్డులో కరెంట్ సరఫరా కట్ చేశారు. అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రోడ్డు క్లియర్ చేశారు. అనంతరం మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం పోలీసులను మోహరించి ఉదయం 10 గంటల నుండి హిటాచి సహాయంతో కూల్చివేత్తలు చేపట్టారు. హిటాచి పాక్షికంగా కూల్చివేతలు చేపట్టడంతో హైడ్రా తీరుపై స్థానికుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కావాలనే కూల్చడం లేదని, అయ్యప్ప సొసైటీలో బిల్డర్లను భయపెట్టేందుకు పాక్షికంగా కూల్చివేత్తలు చేపడుతున్నారన్నా విమర్శలు వినిపించాయి. మీడియాలో కూడా డీఆర్ ఎఫ్ సిబ్బంది పనితీరుపై వ్యతిరేకంగా వార్తలు ప్రసారం కావడంతో అధికారులు మధ్యాహ్నానికి బాహుబలి మిషన్ ను హుటాహుటిన రప్పించి కూల్చివేతల్లో వేగం పెంచారు. అయితే ఇదే విషయంపై హైడ్రా సిబ్బందిని ఆరా తీయగా మిషన్ లో సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం జరిగిందని, కూల్చివేసేందుకు ఆర్డర్ ఉన్నాక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగేది లేదని, సాంకేతిక కారణాల వల్ల బాహుబలి మిషన్ రావడం లేటయిందని వివరణ ఇచ్చారు.
కొనసాగుతున్న కూల్చివేతలు
2 సెల్లార్లు, స్టిల్ట్ ప్లస్ 5 అంతస్తుల నిర్మాణం చేపట్టిన ఈ బిల్డింగ్ ను సాయంత్రం 6 గంటల వరకు 4 అంతస్థులను పాక్షికంగా కూల్చివేశారు. రాత్రి కూడా కూల్చివేతలు కొనసాగుతాయని, ఉదయం వరకు పూర్తిగా తొలగిస్తామని డీఆర్ ఎఫ్ సిబ్బంది తెలిపారు.