షీ-టీమ్ నిర్వహించిన 2కే,5కే‌రన్ లను ప్రారంభించిన సి.ఎస్ శాంతి కుమారి

by samatah |   ( Updated:2023-03-06 06:37:37.0  )
షీ-టీమ్ నిర్వహించిన 2కే,5కే‌రన్ లను ప్రారంభించిన సి.ఎస్ శాంతి కుమారి
X

దిశ , ఖైరతాబాద్ : ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణా పోలీస్ షీ- టీమ్స్, హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ లను ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా డీజీపీ అంజనీ కుమార్, సిటీ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్, మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ షికా గోయల్ లు హాజరయ్యారు. మహిళా భద్రతా, షీ-టీమ్‌లపై చైతన్యం తదితర అంశాలపై చైతనానికి ఉద్దేశించి 2 -కె , 5 -కె రన్ లను సిటీ పోలీస్ ఆధ్వర్యంలో నేడు ఉదయం నెక్లెస్ రోడ్లో నిర్వహించింది. ఈ రన్‌లకు నగరంలోని యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో హాజరు కాగా, మహిళా పోలీసులు, పోలీసు అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story