డ్రగ్స్ ను దేశం నుంచి తరిమికొట్టాలిః కలెక్టర్

by Nagam Mallesh |
డ్రగ్స్ ను దేశం నుంచి తరిమికొట్టాలిః కలెక్టర్
X

దిశ,కార్వాన్ః డ్రగ్స్ ను ఇండియా నుంచి తరిమికొట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సోమవారం హైదరాబాద్ గోల్కొండ ప్రభుత్వ బాలుర ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో నిర్వహించిన నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో డిజేబుల్ వెల్ఫేర్ డైరెక్టర్ బి శైలజతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. విద్యార్థులతో "డ్రగ్స్ ఫ్రీ ఇండియా", డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ" సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల్లో, కళాశాలల్లో మత్తు పదార్థాల వినియోగం జరగకుండా చూడాలని, ఎవరైనా అలా చేస్తే వెంటనే సంబంధిత ఉపాధ్యాయులకు తెలియజేయాలని అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్ధాల గురించి అవగాహన కల్పించాలని అన్నారు. డ్రగ్స్ వల్ల వ్యక్తి ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా, కుటుంబం, సమాజం మొత్తనికి దెబ్బతీస్తుందన్నారు. కొవిడ్ మహమ్మారిని తరిమికొట్టినట్లే మాదకద్రవ్యాలను దేశం నుండి పారదోలాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఈఓ ఆర్. రోహిణి, డిజేబుల్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేందర్, డిప్యూటీ డిఈఓ రమణ రాజు, కళాశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed