ఆర్యవైశ్యుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట

by Sridhar Babu |   ( Updated:2023-11-09 13:31:58.0  )
ఆర్యవైశ్యుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట
X

దిశ, చంపాపేట్ : ఆర్యవైశ్యుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని మహేశ్వరం బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కర్మన్ ఘాట్ లోని వంగ శంకరమ్మ గార్డెన్ లో బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వ‌హించిన బాలాపూర్ మండల ఆర్య‌వైశ్యుల ఆత్మీయ స‌మ్మేళ‌నంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ఆర్యవైశ్యులకు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆత్మగౌరవ భవనాలు, స్థలాలు, నిధులు ఇచ్చారన్నారు.

అనంతరం రాష్ట్ర టూరిజం పూర్వ చైర్మ‌న్ ఉప్ప‌ల శ్రీ‌నివాస్ గుప్త మాట్లాడుతూ ఆర్య వైశ్యులకు సీఎం కేసీఆర్ రాజకీయపరంగా సముచిత స్థానం కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, అమరవాది లక్ష్మీ నారాయణ, ఉప్పల వెంకటేష్, బాలాపూర్ మండల ప్రెసిడెంట్ శ్రీనివాస్ గుప్తా, మీర్ పేట్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా, బడంగ్‌పేట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గుప్తా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చింతల రవి, బచ్చు శ్రీనివాస్ గుప్తా, ఆర్టమ్ లక్ష్మయ్య, రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ వెంకటేష్ గుప్త, మీర్ పేట్ మేయర్, డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story