- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్.. టాప్ హీరోల పై కేసులు నమోదు..

దిశ, శేరిలింగంపల్లి : బెట్టింగ్ యాప్స్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. గత కొద్ది రోజులుగా ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ పై వరుస పోస్టులు చేస్తూ.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పటికే భయ్యా సందీప్, హర్ష సాయి పై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే.
అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న విష్ణు ప్రియ, యాంకర్ శ్యామల, రితూ చౌదరి లాంటి యాక్టర్స్ తో పాటు మరి కొంతమంది పై పంజాగుట్ట పోలీసులు ఇటీవల కేసులు నమోదు చేశారు. తాజాగా మియాపూర్ పోలీసులు మరో అడుగు ముందుకు వేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సినీ హీరోలు దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీ, ప్రకాష్ రాజ్, ప్రణీత, నిధి అగర్వాల్ లపై మియాపూర్ పోలీసులు బుధవారం రోజు కేసులు నమోదు చేశారు. వారి పై ఎఫ్ఐఆర్ నెంబర్ 393/2025 కింద కేసులు నమోదు కాగా సెక్షన్లు 318 (4) 112, రెడ్ విత్ 49 బీఎన్ ఎస్ 3,3(ఏ) 4, టీఎస్ జీఏ,66-డి ఐటీఏ 2000-2008 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Read More..
Vishnupriya: బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసుల స్పీడ్.. పంజాగుట్ట పీఎస్ లో విచారణకు విష్ణుప్రియ
సినీనటులే కాదు.. ఎవరినీ వదిలిపెట్టం.. వెస్ట్‌జోన్ డీసీపీ హెచ్చరిక