- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Dasoju Sravan: రేవంత్ రెడ్డి .. నీది నోరా.. మోరా ?
దిశ, వెబ్ డెస్క్: చిల్లర మాటలకు, అవాకులు చావాకులకు, నిరాధారమైన మాటలకు మారుపేరుగా రేవంత్ రెడ్డి మారారని బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు దాసోజు శ్రవణ్ విమర్శించారు. మంత్రి కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కోసం కేంద్రమంత్రులను కలవడానికి వెళితే.. ఒక ఎంపీగా, ప్రతిపక్ష నాయకుడిగా స్వాగతించాల్సింది పోయి అవాకులు చావాకులు మాట్లాడుతూ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో కలసి కేంద్రమంత్రులను ఎందుకు కలిశారో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని, వాళ్లు కూడా కేసుల మాఫీ కోసం కలిసినట్లేనా? అని దాసోజు ప్రశ్నించారు. 125 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక రాజకీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి చిల్లర మాటలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి.. ‘నీది నోరా.. మోరా’ అని దాసోజు నిలదీశారు.
‘మంత్రి కేటీఆర్ ఢిల్లీ వెళ్లి.. మియాపూర్ నుంచి హయత్ నగర్ వరకూ మెట్రో రైల్ కావాలని కోరితే అది కుమ్మక్కు రాజకీయమా?. ఎయిర్ పోర్ట్‌కు ఎక్స్‌ప్రెస్ మెట్రో కావాలని కోరడం కుమ్మక్కు రాజకీయమా?. వరంగల్‌కు మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం అడిగితే అది కుమ్మక్కు రాజకీయమా?. తెలంగాణ పట్టణాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని అడిగితే అడికుమ్మక్కు రాజకీయమా?. వరి కొనుగోళ్ళ కోటాను తెలంగాణకు పెంచండని కోరడం కుమ్మక్కు రాజకీయమా?.’ అని దాసోజు ప్రశ్నించారు.