వచ్చే ఎన్నికల్లో BRS వంద సీట్లలో గెలవడం ఖాయం: ఎమ్మెల్యే ముఠా గోపాల్

by Satheesh |
వచ్చే ఎన్నికల్లో BRS వంద సీట్లలో గెలవడం ఖాయం: ఎమ్మెల్యే ముఠా గోపాల్
X

దిశ, ముషీరాబాద్: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ వంద సీట్లలో గెలవడం ఖాయమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. మంగళవారం బాగ్‌ లింగంపల్లిలోని ఆర్టీసీ కళా భవన్‌లో ముషీరాబాద్ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, నగర ఇంచార్జీ దాసోజు శ్రావణ్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. ముషీరాబాద్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో అభివృద్ది కోసం కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేయించామన్నారు. కేసీఆర్ చెప్పిన విధంగా 100 అసెంబ్లీ స్థానాల్లో గెలిపించాలన్నారు.

కేంద్ర మంత్రిగా వ్యవహారిస్తున్న సికింద్రాబాద్ ఎంపీ నాలుగేళ్లు అవుతున్నా ఎలాంటి అభివృద్ధి చర్యలు చేపట్ట లేదని విమర్శించారు. ఈ సందర్భంగా రాంనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమకారులతోనే తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్, బీఆర్ఎస్కేవి రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్‌లు పాల్గొని ప్రసంగించారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed