- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BREAKING: జోరా పబ్‌పై నార్కోటిక్ బ్యూరో మెరుపు దాడి.. డ్రగ్స్ తీసుకున్న 11 మంది అరెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా చేసేందుకు ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు మాదక ద్రవ్యాలతో రెడ్ హ్యాండెడ్‌గా ఎవరు పట్టుబడినా.. తీసుకున్నా వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలంటూ పోలీసు శాఖకు ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్, ఇతర పోలీసు, నార్కోటిక్ బ్యూరో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లు, పబ్బులు, క్లబ్‌లలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ.. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుని ఎక్కడికక్కడ కేసులు బుక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం అర్ధరాత్రి జూబ్లీహిల్స్‌లోని జోరా పబ్బులో నార్కోటిక్ బ్యూరో పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో పబ్బులో ఈవెంట్‌లో పాల్గొన్న వారికి పరీక్షలు నిర్వహించారు. అయితే, అందులో మొత్తం 11 మది డ్రగ్స్ తీసుకున్నట్లుగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో వారందరిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read More..