బీసీలను మోసం చేయడానికే బీసీ బంధు

by Sridhar Babu |   ( Updated:2023-08-16 14:59:41.0  )
బీసీలను మోసం చేయడానికే బీసీ బంధు
X

దిశ, చందానగర్ : బీసీలను మోసం చేయడానికే బీసీ బంధు అని బీజేపీ, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు అన్నారు. బుధవారం మియాపూర్ డివిజన్ ఆర్ బీఆర్ కాంప్లెక్స్ వద్ద ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నాగేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఓబీసీ నాయకులు గడీల శ్రీకాంత్ గౌడ్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మువ్వ సత్యనారాయణ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ ,సురభి రవీంద్ర రావు, సీనియర్ నాయకులు కొరదాల నరేష్, అసెంబ్లీ కన్వీనర్ రాఘవేంద్ర రావులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీలను దగా చేయడానికే ఎన్నికల సమయంలో కేసీఆర్ మరో కుట్ర చేస్తున్నారన్నారు. నిరుద్యోగ యువతకు , కుల వృత్తులకు 2017-2018 నుంచి ఏడేళ్ల నుంచి ఒక్క రుణం కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణలో బీసీలు వ్యతిరేకంగా ఉన్నారని ,ఓట్లు వేయరని భయపడి ఇప్పుడు బీసీ బంధు డ్రామా కు తెరలేపారన్నారు. మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు పెండింగ్‌లో ఉన్నాయని, ఓట్ల కోసం ఇప్పుడు బీసీలకు లక్ష రూపాయల పేరుతో ,కొన్ని కులవృత్తుల వారికే ఇచ్చి బీసీలను విభజించే కుట్ర చేస్తున్నారని అన్నారు. ఇస్తే అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పృథ్వి గౌడ్ , శ్రీశైలం కుర్మ, నరేందర్ ముదిరాజ్, బుచ్చి రెడ్డి, మనోహర్ , లక్ష్మణ్ ముదిరాజ్, మాణిక్ రావు, ఆంజనేయులు సాగర్, రవి, మహేష్, చందు, గణేష్ , రాజు శెట్టి, చంద్ర మౌళి, శ్రీనివాస్ యాదవ్, రాము, విజయేందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed