బిగ్ బ్రేకింగ్.. అపార్టుమెంట్ లోని మహిళలపై ఎంఐఎం కార్యకర్తల దాడి..

by Nagam Mallesh |
బిగ్ బ్రేకింగ్.. అపార్టుమెంట్ లోని మహిళలపై ఎంఐఎం కార్యకర్తల దాడి..
X

నాంపల్లిలో ఎంఐఎం కార్యకర్తలు రెచ్చిపోయారు. నాంపల్లిలోని ప్లెజెంట్ అపార్ట్ మెంట్ వాసులపై ఎంఐఎం కార్యకర్తలు, మద్దతుదారుల దాడి చేశారు. అపార్ట్ మెంట్ లోని మహిళలు, యువకులపై దాడికి పాల్పడ్డారు. అపార్టుమెంట్ ముందుభాగంలో ఉన్న ఆక్రమణల తొలగింపు విషయంలో వివాదం నెలకొంది. ఇదే విషయంపై సోమవారం అర్ధరాత్రి అపార్టుమెట్ మహిళలు, యువకులపైకి ఎంఐఎం కార్యకర్తలు దూసుకొచ్చి దాడి చేశారు. దాడి చేయడంతో వారు భయభ్రాంతులకు గురయ్యారు. పాతబస్తీలో ఐఎంఎం ఆగడాలకు అంతులేకుండా పోతుందని అపార్ట్ మెంట్ వాసులు వాపోతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను శాంతింపజేశారు. నాంపల్లి డీఎస్పీ ఇరు వర్గాలతో చర్చిస్తున్నారు.

Advertisement

Next Story