సర్వే ముగిసింది.. ఇక టాక్స్ వసూలు చేయండి

by Mahesh |
సర్వే ముగిసింది.. ఇక టాక్స్ వసూలు చేయండి
X

దిశ, సిటీబ్యూరో : ‘సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ముగిసింది కదా.. ఇక ఆస్తి పన్ను వసూళ్లపై దృష్టిపెట్టాలి, ఇచ్చిన టార్గెట్‌ను చేరుకోవాల్సిందే, ఎవరికి మినహాయింపులేదని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్(రెవెన్యూ) అనురాగ్ జయంతి ఆదేశాలు జారీచేశారు. బిల్ కలెక్టర్లు, ట్కాక్స్ ఇన్‌స్పెక్టర్లు, ఏఎంసీలతో బుధవారం సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. చార్మినార్ జోన్ పరిధిలో వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీచేయాలని చీఫ్ వాల్యూయేషన్ ఆఫీసర్‌ను ఆదేశించారు. ట్యాక్స్ అసెస్‌మెంట్, ఆన్‌లైన్ మ్యుటేషన్స్, చెక్ బౌన్స్ కేసులు, కోర్టు కేసులు, రిజిస్ట్రేషన్ కాగానే పన్ను విధించే ఫైళ్లు వంటి వాటిపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా బేగంపేట్, శేరిలింగంపల్లి, ముషీరాబాద్ సర్కిళ్ల అధికారులపై సీరియస్ అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed