- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్దార్ పాపన్న విగ్రహం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేస్తాం
దిశ, రవీంద్రభారతి : ట్యాంక్ బండ్ పై త్వరలోనే సర్దార్ పాపన్న మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం జై గౌడ్ ఉద్యమం కమిటీ ఆధ్వర్యంలో 374వ సర్దార్ పాపన్న మహారాజ్ జయంతి వేడుకలు రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ లు సర్దార్
పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులుర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బహుజన రాజ్యం కోసం జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప మహానీయుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు. నిజాం పాలకులకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి బహుజనుల అభ్యున్నతికి కృషి చేశారని, ఆయన బాటలో బహుజనులు, గౌడ కులస్తులు నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జై గౌడ ఉద్యమం కమిటీ జాతీయ అధ్యక్షులు వట్టికూటి రామారావు గౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు తుళ్ల వీరేందర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.