- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీది మొత్తం 1000 అయింది.. కుమారీ ఆంటీ డైలాగ్‌తో పోలీసుల సెన్సేషనల్ ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది చార్మినార్, ధమ్ బిర్యానీ, ఇరానీ చాయ్, మక్కా మసీదు. ఇదంతా ఒకప్పుడు.. ఇప్పుడు హైదరాబాద్ అంటే టక్కున గుర్కొచ్చేది గచ్చిబౌలి కుమారీ ఆంటీ. ప్రస్తుతం కుమారీ ఆంటీ గురించి తెలియని సోషల్ మీడియా యూజర్ ఉండడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తక్కువ రోజుల్లో ఫుల్ పాపులర్ అయింది. ముఖ్యంగా ‘మీది మొత్తం 1000 అయింది. రెండు లివర్లు ఎక్స్‌ట్రా’ డైలాగ్ కొంతకాలం ఇన్‌స్టాగ్రామ్‌ను కుదిపేసింది. ఇటీవల ఆమె పలు టీవీ షోల్లోనూ కనిపించి సందడి చేసింది. అంతేకాదు.. ట్రాఫిక్ పోలీసులు, కుమారీ ఆంటీ మధ్య వివాదంపై స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఆమెకు సపోర్ట్ చేయడం, స్వయంగా అక్కడకు వచ్చి ఆమె చేతి వంట తింటానని ప్రకటించడం సంచలనంగా మారింది.
ఇదిలా ఉండగా.. ఆమెతో పాటు ఆమె డైలాగ్ కూడా అంతే ఫేమస్ అయింది. ఆ డైలాగ్‌ను అంతా సుబ్బరంగా వాడేస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా క్రేజీగా వాడారు. సిటీలోని ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఒక బైకర్ హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడు. నెంబర్ ప్లేట్ కనిపించకుండా చేశాడు. అతన్ని ఫొటో తీసిన ట్రాఫిక్ పోలీసన్న.. సోషల్ మీడియా(ఎక్స్)లో ఒక ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో ‘మీది మొత్తం 1000 అయింది. యూజర్ చార్జెస్ ఎక్స్‌ట్రా’ ట్వీట్ పెట్టారు. దీంతో షాకైన నెటిజన్లు నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఇలా కూడా ఫైన్లు విధిస్తారా? అని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పోలీసుల ట్వీట్ వైరల్‌గా మారింది.