Hyderabad: పబ్బులపై ఫోకస్ పెట్టాం.. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
Hyderabad: పబ్బులపై ఫోకస్ పెట్టాం.. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల(Drunk and Drive Cases)పై ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే(Traffic DCP Rahul Hegde) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. హైదరాబాద్‌లోని పబ్‌(Pub)లపై తాము ఫోకస్ పెట్టామని అన్నారు. మైనర్లను పబ్‌లోని అనుమతించొద్దని చెప్పారు. నగరంలోని చాలా పబ్బుల్లో ట్రాఫిక్ సదుపాయం(Traffic Facility) లేదని అన్నారు. ఇష్టానుసారం రోడ్లపైనే పార్కింగ్(Parking) చేస్తున్నారని తెలిపారు. పబ్స్ దగ్గర 40 శాతం పార్కింగ్ స్పేస్(Parking Space) తప్పకుండా ఉండాలని సూచించారు.

ఈ ఏడాది 50 వేలకు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు(Drunk and Drive Cases) నమోదు అయ్యాయని అన్నారు. పట్టుబడిన వారిలో 25 ఏళ్ల వయసున్న యువకులే ఎక్కువశాతం ఉన్నారని తెలిపారు. ఇక నుంచి అలాంటి పరిస్థితిని ఉపేక్షించబోమని.. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కువ డ్రింక్ చేస్తే, రోడ్లపైన న్యూసెన్స్ క్రియేట్ చేస్తే తప్పకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

Advertisement

Next Story

Most Viewed