- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిబంధనలు ఉల్లంఘించిన పబ్ యాజమాన్యం.. రంగంలోకి పోలీసులు
by GSrikanth |
X
దిశ, డైనమిక్ బ్యూరో: హైకోర్టు నిబంధనలను ఉల్లంఘించిన పబ్‌లపై హైదరాబాద్ పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు నిబంధనలను పెడచెవిన పెట్టిన మూడు పబ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. 'శబ్ధ కాలుష్య నిబంధన' పాటించలేదని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని అమ్నీషియా, ఎయిర్ లైవ్, జీరో40 పబ్‌లపై కేసు నమోదైనట్లు వెల్లడించారు. అయితే, ఇటీవల హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 10 గంటలు దాటిన తరువాత ఎక్కువ సౌండ్స్ పెట్టకూడదని సూచించింది. తెల్లవారుజామున 6 గంటల వరకు ఇది వర్తిస్తుందని తెలిపింది. సిటీ పోలీస్ యాక్ట్, నాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్ ప్రకారం లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత లిమిట్ వరకే అనుమతి ఉంటుందని చెప్పింది. ఈ సందర్భంగా కోర్టు ఆదేశాలను కొందరు పబ్ నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
Advertisement
Next Story