ఉప్పల్ లో హైదరాబాద్-ముంబయి మ్యాచ్.. క్రికెట్ లవర్స్ కు హైదరాబాద్ మెట్రో రైలు తీపికబురు

by Prasad Jukanti |
ఉప్పల్ లో హైదరాబాద్-ముంబయి మ్యాచ్.. క్రికెట్ లవర్స్ కు హైదరాబాద్ మెట్రో రైలు తీపికబురు
X

దిశ, డైనమిక్ బ్యూరో:క్రికెట్ లవర్స్ కు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్)- ముంబయి మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనున్నది. రాత్రి 7:30 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ మ్యాచ్ సందర్భంగా బుధవారం మెట్రో రైల్ సమయం పొడిగించినట్లు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్ వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ నిర్ణీత సమానికి మించి నడుస్తాయని స్పష్టం చేశారు. చివరి రివరి రైళ్లు రాత్రి 12:15 గంటలకు బయలుదేరుతాయని.. 1:10కి గమ్యస్థానాలకు చేరుకుంటాయని తెలిపారు. ఈ సదుపాయాన్ని ప్రేక్షకులు వినియోగించుకుని క్రికెట్ ను ఆస్వాదించాలని హైదరాబాద్ మెట్రో పేర్కొంది.

Advertisement

Next Story