Hyderabad Metro : రికార్డు క్రియేట్ చేసిన హైద‌రాబాద్ మెట్రో

by GSrikanth |   ( Updated:2023-07-04 12:00:00.0  )
Hyderabad Metro : రికార్డు క్రియేట్ చేసిన హైద‌రాబాద్ మెట్రో
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైద‌రాబాద్ మెట్రో రైలు రికార్డు క్రియేట్ చేసింది. జూలై 3న ఒక్క రోజే మెట్రో రైలులో 5 ల‌క్షల 10 వేల మంది ప్రయాణికులు ట్రావెల్ చేశారని మెట్రో రైల్ అధికారులు తెలిపారు. ఒక్కరోజే ఇంత భారీ స్థాయిలో ప్రయాణించడం సరికొత్త రికార్డు అని తెలిపారు. నాగోల్ నుంచి హైటెక్ సిటీ, ఎల్బీ న‌గ‌ర్ నుంచి కూక‌ట్‌ప‌ల్లి రూట్లో భారీ సంఖ్యలో ప్రయాణికులు ట్రావెల్ చేశారని వెల్లడించారు.

ఇప్పటి వరకు హైద‌రాబాద్ మైట్రోరైలు 40 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసిందన్నారు. 2017 నవంబర్ 29న ప్రారంభమైన హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికులు సంఖ్య ఇటీవల పెరిగిందని వెల్లడించారు. సోమ‌వారం రోజున ఉప్పల్‌, ఎల్బీన‌గ‌ర్ స్టేష‌న్లు కూడా ప్రయాణికుల‌తో నిండిపోయిందన్నారు.

Advertisement

Next Story