‘అసద్ భాయ్.. నేనొస్తున్నా’.. హైదరాబాద్ బీజేపీ MP అభ్యర్థి మాధవీలత ఆసక్తికర వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2024-03-04 02:11:13.0  )
‘అసద్ భాయ్.. నేనొస్తున్నా’.. హైదరాబాద్ బీజేపీ MP అభ్యర్థి మాధవీలత ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తాను పార్టీలో లేనని, తనపై వస్తున్న కామెంట్స్‌ను తాను పట్టించుకోబోనని, సొంత ఇంటివారు చేసే వ్యాఖ్యలు ఇబ్బందికరం ఏమీ కావని హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత అన్నారు. హైదరాబాద్ లోక్ సభ అభ్యర్థిగా టికెట్ ప్రకటన తర్వాత ఢిల్లీలో ఆదివారం పార్టీలో చేరారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తాను సంఘ్ నుంచి వచ్చానని, తాను చేసిన సేవే తనకు టికెట్ వచ్చేలా చేసిందని వ్యాఖ్యానించారు. ధర్మం, న్యాయం తెలిసినదాన్ని ప్రజల కోసం పని చేస్తానని ఆమె పేర్కొన్నారు. అసద్ భాయ్.. తానొస్తున్నానంటూ ఆమె వ్యాఖ్యానించారు.

చట్టవ్యతిరేకమైన పనులు చేస్తే ఇక ఊరుకునేదే లేదని వార్నింగ్ ఇచ్చారు. అసదుద్దీన్ మైనారిటీలకు, హిందువులకు ఎవరికీ న్యాయం చేయట్లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్యాయంగా యువకులను జైల్లో వేయిస్తున్నారని ఫైరయ్యారు. హైదరాబాద్ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈసారి మార్పు తథ్యమని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాధవీలత చెప్పారు. 40 ఏండ్ల తర్వాత హైదరాబాద్‌లో మార్పు రాబోతోందని, అసదుద్దీన్‌ను ప్రజలు ఇంటికి పంపించడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తంచేశారు.

Advertisement

Next Story