- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
HYD : ఓయూలో మరోసారి నాగుపాము కలకలం
X
దిశ, వెబ్డెస్క్: ఉస్మానియా మరోసారి నాగుపాము కలకలం రేపింది. న్యూ పీజీ హాస్టల్ వద్ద ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసే స్థలంలో నాగుపాము కనిపించింది. పడగవిప్పి బుసలు కొడుతూ ఓ బైక్ వద్ద నాగు పాము ప్రత్యక్షం అవడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నవాళ్లు ఉలిక్కిపడ్డారు. కొంత మంది పామును దగ్గర నుంచి ప్రమాదకరంగా వీడియో తీశారు. కాగా, కొన్ని నెలల కిందట పాముకాటుతో ఓయూ ఉద్యోగి మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి నాగుపాము కనిపించడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం నాగుపాము బుసలు కొడుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Advertisement
Next Story