HYD: నిమ్స్‌కు మంత్రి దామోదర.. అస్వస్థతకు గురైన విద్యార్థినులకు పరామర్శ

by Ramesh Goud |
HYD: నిమ్స్‌కు మంత్రి దామోదర.. అస్వస్థతకు గురైన విద్యార్థినులకు పరామర్శ
X

దిశ, వెబ్ డెస్క్: నిమ్స్(NIMS Hospital) లో పర్యటించిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodara Rajanarsimha) అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించారు. ఇటీవల కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా(Komuram Bhim Asifabad District) వాంకిడి మండలం(Vankidi Mandal) ఆశ్రమ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు మహాలక్ష్మి, జ్యోతి, శైలజ అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరోచనాలతో గత కొద్ది రోజుల నుండి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ స్వయంగా నిమ్స్ ఆస్పత్రికి వచ్చి విద్యార్థులను పరమర్శించారు. విద్యార్థుల ఆరోగ్యంపై నిమ్స్ వైద్యులను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులతో మాట్లాడి, జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేగాక త్వరగా పూర్తిగా కోలుకొని స్కూల్ కి వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాలని మంత్రి ఆకాంక్షించారు.

Advertisement

Next Story

Most Viewed