HYD : అర్థరాత్రి పాతబస్తీలో కారు భీభత్సం

by Sathputhe Rajesh |
HYD : అర్థరాత్రి పాతబస్తీలో కారు భీభత్సం
X

దిశ, చార్మినార్​ : హైదరాబాద్​ పాతబస్తీలో సోమవారం తెల్లవారుజామున కారు భీభత్సం సృష్టించింది. క్యాబ్​ డ్రైవర్​ ర్యాష్​ డ్రైవింగ్​ కారణంగా ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన పాతబస్తీ మీర్​ చౌక్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో తీవ్ర కలకలం రేపుతుంది. మీర్​చౌక్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వనస్థలిపురంనకు చెందిన ఓ క్యాబ్​ డ్రైవర్​ మరో ఇద్దరు కస్టమర్లను ఎక్కించుకుని ఆదవారం రాత్రి చార్మినార్​కు వచ్చారు. సోమవారం తెల్లవారు జామున 2గంటల ప్రాంతంలో చార్మినార్​ నుంచి తిరిగి వనస్థలిపురంనకు బయలు దేరారు.

మార్గమధ్యలో పురాణిహవేలి వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా కారు వేగం పెరిగింది. దీంతో ముందు వెళ్తున్న బైక్​లను, కారులను ఢీకొడుతూ లాక్కెళ్లింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు పట్టుకోవడానికి పరిగెత్తారు. దీంతో కారును అక్కడే వదిలిన డ్రైవర్​తో పాటు మరో ఇద్దరు ప్రాణ భయంతో పరుగులు దీశారు. వెంబడించిన స్థానికులు ఇద్దరు పర్యాటకులను పట్టుకుని విచక్షణ రహితంగా దాడిచేశారు. కాసేపటికే డ్రైవర్​తో పాటు మరో ఇద్దరిని డ్రంక్​ ఆండ్​ డ్రైవ్​ పరీక్ష చేయగా నిల్​ వచ్చింది. కారులో మాత్రం బీర్​ సీసాలు దొరికాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కేసును మీర్​చౌక్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story