Hydra: క్షణాల్లో సమాచారం చేరేలా కొత్త టెక్నాలజీ.. ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2025-01-17 10:24:49.0  )
Hydra: క్షణాల్లో సమాచారం చేరేలా కొత్త టెక్నాలజీ.. ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రమాదం జరిగిన వెంటనే క్షణాల్లో ఆ సమాచారం హైడ్రా(Hydra)కు చేరేలా టెక్నాలజీని(Technology) తీసుకొని రావాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) అన్నారు. శుక్రవారం తెల్లవారుజామున పాత ముంబై హైవే దారిలోని షేకేపేట(Shaikpet)లో అగ్నిప్రమాదం జరిగిన డ్యూక్స్ అవెన్యూ భవనాన్ని(Avenue building) హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా.. అగ్నిప్రమాదానికి గల కారణాలను అక్కడి హైడ్రా డీఆర్ఎఫ్(Hydra DRF), ఫైర్(Fire) బృందాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే అగ్నిప్రమాదం చోటు చేసుకున్న రెండో అంతస్తుని పరిశీలించారు. ఆకాశ్ ఇనిస్టిట్యూట్(Akash Institute) న‌డుస్తున్న రెండో అంత‌స్తు మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది.అగ్ని ప్రమాద సమాచారం తెలియగానే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక దళంతో పాటు హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మంటలను రెండో అంతస్తు కే పరిమితం చేసారని వారు తెలిపారు.

అంతేగాక రెండంతస్తుల సెల్లార్ తో పాటు నాలుగు పై అంతస్తుల భవనం మొత్తం పొగ వ్యాపించిందని.. రెండో అంతస్తులో వున్న ఆకాశ్ శిక్షణ కేంద్రం బాగా దెబ్బ తినిందని అక్కడ సిబ్బంది కమిషనర్ కు వివరించారు. సీసీ టీవీ ఫూటజీని పరిశీలించి అగ్ని ప్రమాదానికి కారణాలను పరిశీలించాలని రంగనాథ్ అధికారులకు ఆదేశించారు. అగ్ని ప్రమాదం ప్రారంభంలోనే అప్రమత్తం చేసే వ్యవ‌స్థను ఏర్పాటు చేసుకోవాల‌ని భ‌వ‌న య‌జ‌మానుల‌కు సూచించారు. అలాగే నిప్పు రాజుకున్న క్షణాల్లో ఆ సమాచారం హైడ్రా డీఆర్ఎఫ్ కు చేరేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచుకోవాలన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించుకోవడంతో పాటు ఇతర ఉత్తమ పద్ధతులను పాటించాలని సూచించారు. ఇక డీఆర్ఎఫ్‌, ఫైర్ విభాగాల‌కు ఫైర్ అలార‌మ్ వ‌చ్చే వ్యవ‌స్థ ఉంటే ప్రమాదాలు చాలావ‌ర‌కు త‌గ్గించ‌వ‌చ్చు అని చెప్పారు. ఇవాళ జ‌రిగిన ఘ‌ట‌న‌లో డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది వెంట‌నే స్పందించ‌డంతో న‌ష్టాన్ని కొంత‌మేర త‌గ్గించార‌ని రంగనాథ్ వెల్లడించారు


Next Story

Most Viewed