Mumbai Police: అతనికి సైఫ్ అలీఖాన్ కేసుతో సంబంధం లేదు

by Gantepaka Srikanth |
Mumbai Police: అతనికి సైఫ్ అలీఖాన్ కేసుతో సంబంధం లేదు
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్(Bollywood) హీరో సైఫ్ అలీఖాన్‌(Saif Ali Khan)పై అత్యాయత్నం కేసులో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా.. ఈ వార్తలపై ముంబై పోలీసులు స్పందించారు. సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు. బాంద్రా పోలీస్ స్టేషన్‌(Bandra Police Station)కు తీసుకొచ్చిన వ్యక్తికి సైఫ్ కేసుతో సంబంధం లేదని తేల్చారు.

కాగా, ప్రస్తుతం సైఫ్ లీలావతి హాస్పిటల్‌(Lilavati Hospital)లో చికిత్స పొందుతున్నారు. డాక్టర్లు విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేయడంతో సైఫ్ ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారు. మరోవైపు.. సైఫ్‌పై దాడి గురించి తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులంతా ఒక్కసారిగా హడలెత్తారు. సైఫ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. షారూఖ్ ఖాన్(Shah Rukh Khan) స్వయంగా లీలావతి హాస్పిటల్‌కు వచ్చి సైఫ్ అలీ ఖాన్‌ను పరామర్శించారు. ఈ దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న ముంబై పోలీసులు విచారణను వేగవంతం చేస్తున్నారు.



Next Story

Most Viewed