HYD : మొండెం లేని పసికందు మృతదేహం లభ్యం

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-22 05:42:16.0  )
HYD : మొండెం లేని పసికందు మృతదేహం లభ్యం
X

దిశ, జూబ్లీహిల్స్: బోరబండ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని దారుణం చోటు చేసుకుంది. స్థానిక బోరబండ కుంట (గుడిసెలు) వద్ద గుర్తు తెలియని నవజాత శిశువు ప్లాస్టిక్ కవర్లో లభ్యమైంది. మొండెం లేని ( అర్ధ భాగం మాత్రమే ) నెలల పసికందు మృతదేహం లభ్యం కావడంతో ఒక్క సారిగా కలకలం రేపింది. బోరబండ కుంట (గుడిసెలు) వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ప్లాస్టిక్ కవర్ లో నావజాత శిశువును పడేసారు.

గురువారం ఆ ప్లాస్టిక్ కవర్ నీ కుక్కలు రోడ్డు పైకి తీసుకుని రావటంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుర్వాసన కుళ్ళిన స్థితిలో మొండెం లేని పసికందు మృతదేహం కనిపించడంతో స్థానికులు బోరబండ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి, గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed