- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శ్రీశైలం అన్ని గేట్లు మూసివేత.. వందల సంఖ్యలో ఒక్కసారిగా చేపల వేటకు వచ్చిన మత్స్యకారులు
దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిపై ఉన్న అన్ని జలాశయాలు నిండుకుండల్లా మారిపోయాయి. ఈ క్రమంలోనే శ్రీశైలం జలాశయం కూడా రెండు సంవత్సరాల తర్వాత పూర్తిగా నిండిపోయింది. దీంతో దాదాపు 15 రోజుల పాటు గేట్లు ఎత్తి నీటిని వదిలిన అధికారులు ప్రస్తుతం నీటి ఉధృతి తగ్గడం తో గేట్లు మూసివేశారు. అయితే ఇన్ని రోజులు వరద ఉధృతి అధికంగా ఉండటంతో చేపల వేట పై ఆదారపడిన మత్స్యకారులను వేటకు వెళ్లి నివ్వలేదు. తాజాగా అన్ని గేట్లను మూస్తున్నారనే సమాచారం అందడంతో ఒక్కసారిగా వందల సంఖ్యలో మత్స్య కారులు తమా తెప్పలను తీసుకుని డ్యామ్ గేట్ల ముందు సిద్ధంగా ఉన్నారు. చివరి గేట్ మూసివేయడం పూర్తి కాగానే పందెంలో వెళ్ళినట్టు ఒక్కసారిగా మత్స్యకారులు వలలు విసిరారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా శ్రీశైలం జలాశయంలో భారీ చేపలు ఉంటాయి. వాటిని హైదరాబాద్ వచ్చే పర్యాటకులు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తారు. దీంతో అక్కడ పట్టే ఫ్రేష్ చేపలకు భారీ డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ గేట్లను మూసివేయడంతో మత్స్యకారులకు ఒక్కో చేప ఐదు నుంచి 20 కేజీల బరువున్నవి పడుతున్నట్లు తెలుస్తోంది.
Read More..
Srisailam Dam:చేపల కోసం శ్రీశైలం డ్యాం దగ్గర పెద్ద ఎత్తున మత్స్యకారులు