- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Big Breaking News : ఇంటర్ విద్యార్థులకు భారీ ఊరట

దిశ, వెబ్ డెస్క్ : ఇంటర్మీడియట్ విద్యార్థుల(Intermediate Students)కు తెలంగాణ సర్కార్(Telangana Govt) భారీ ఊరట కల్పించింది. రాష్ట్రంలో మంగళవారం నుంచి మొదలవబోతున్న ఇంటర్ పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఇంటర్ పరీక్షల్లో ప్రతిసారి విధించే 'ఒక నిముషం ఆలస్యం'(One Minute Late Rule) నియమాన్ని బోర్డు ఈసారి పక్కన పెట్టింది. పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుండగా.. విద్యార్థులు వారికి కేటాయించిన సెంటర్స్ కి ఉదయం 8.45 కే చేరుకోవాలని హాల్ టికెట్స్ లో సూచించారు. అయితే ప్రతి ఏటా విధించే ఒక నిముషం ఆలస్యం నియమం ప్రకారం.. పరీక్ష రాసే విద్యార్థులు ఎవరైనా ఉదయం 9 గంటల తర్వాత పరీక్ష కేంద్రాలకు ఒక నిముషం ఆలస్యంగా చేరుకున్నా లోపలికి అనుమతి నిరాకరించేవారు. బోర్డు విధించిన ఈ నియమం వలన ప్రతి సంవత్సరం వందల మంది విద్యార్థులు పరీక్ష రాయకుండా బాధతో వెనుదిరిగే వారు.
ముందురోజు పగలు రాత్రి నిద్ర మానుకొని పరీక్షకు సిద్ధమయిన విద్యార్థులను ఒక నిముషం ఆలస్యం కారణంగా లోపలికి నిరాకరించడం ఏమిటని తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రభుత్వాన్ని నిలదీసేవారు. ఈ నియమంపై విమర్శలు అధికం అవుతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విద్యార్థులు 5 నిముషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేలా వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1532 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్టు ఇంటర్ పరీక్షల బోర్డు వెల్లడించింది. పరీక్షా కేంద్రాల వద్ద పరీక్ష జరుగుతున్న సమయంలో 144 సెక్షన్ అమలులో ఉండనుంది.