విద్యుత్‌ శాఖలో భారీగా ప్రమోషన్లు

by M.Rajitha |   ( Updated:2024-10-13 15:51:00.0  )
విద్యుత్‌ శాఖలో భారీగా ప్రమోషన్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యుత్ శాఖలో జెన్కో పరిధిలో ఉద్యోగులకు భారీస్థాయిలో పదోన్నతులు లభించాయి. మొత్తం 261 మందికి ప్రమోషన్లను కల్పించారు. ఈమేరకు జెన్కో సీఎండీ రోనాల్డ్ రోస్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్లుగా పనిచేసిన 34 మందిని డివిజనల్ ఇంజినీర్లుగా ప్రమోషన్ కల్పించారు. అలాగే 170 అసిస్టెంట్ ఇంజినీర్లు, 33 ఏఏఈలను అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్లుగా పదోన్నతి కల్పించారు. ఏడుగురు డివిజనల్ ఇంజినీర్లను.., సూపరింటెండింగ్ ఇంజినీర్లుగా ప్రమోషన్ కల్పించారు. ఇద్దరు సూపరింటెండింగ్ ఇంజినీర్లను చీఫ్ ఇంజినీర్లుగా, 12 మంది ఏడీఈలను డివిజనల్ ఇంజినీర్లుగా, ముగ్గురు డివిజనల్ ఇంజినీర్లను సూపరింటెండింగ్ ఇంజినీర్లుగా శాఖ పదోన్నతులు కల్పించింది.

Advertisement

Next Story