- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Hot News: ‘కమలం’సారథి ఎవరు..? ఇప్పటికే పేరును ఖరారు చేసిన బీజేపీ హైకమాండ్!
దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో కాషాయ పార్టీకి కొత్త రథసారథి రాబోతున్నారు. ఈ నెలాఖరులోగా ఈ అంశంపై స్పష్టత రానుంది. పార్టీ స్టేట్ చీఫ్ ఎవరనే దానిపై అధిష్టానం ఒక స్పష్టతకు వచ్చిన్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి సంకేతాలు అందించినట్టు వినికిడి. పలువురు కీలక నేతల చెవిలోనూ అధ్యక్షుడు ఎవరనే అంశంపై స్పష్టతనిచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే, నూతన అధ్యక్షుడు ఎవరనే దానిపై అధికారిక ప్రకటన కోసం ఈ నెలాఖరు వరకు ఆగాల్సిందే. పార్టీ ఎవరికి రథసారధిగా బాధ్యతలను అప్పగిస్తుందనే విషయంపై శ్రేణులు సర్వత్రా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఆశావహుల్లోనూ ఉత్కంఠ నెలకొంది.
సంస్థాగత ఎన్నికల కసరత్తు ముమ్మరం
సంస్థాగత ఎన్నికలకు సంబంధించి పార్టీ ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసింది. నవంబర్ 25 నుంచి ఈ ప్రక్రియను చేపడుతోంది. ఈ నెల 10వ తేదీ లోపు బూత్ కమిటీ ఎన్నికలు పూర్తి చేయాలని పార్టీ ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. డిసెంబర్ 10 నుంచి 20 వరకు మండల కమిటీలు కంప్లీట్ చేయాలని పేర్కొంది. ఈ ప్రక్రియ అనంతరం రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీ బూత్‌ల వారీగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి వరుసగా వర్క్‌షాప్‌లు నిర్వహించింది. గ్రౌండ్ నుంచి పార్టీని స్ట్రాంగ్ చేయాలని ఇవన్నీ చేపట్టింది. సంస్థాగత ఎన్నికల నిర్వహణతో పాటు సభ్యత్వాలు, యాక్టివ్ మెంబర్‌షిప్ అంశాలపైనా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే జాతీయ, రాష్ట్ర సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారులను హైకమాండ్ నియమించింది. జాతీయ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ను, రాష్ట్ర సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణను నియమించింది. వారు కసరత్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.
అధ్యక్ష రేసులో ఎంపీలు, ఎమ్మెల్యేలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు జాతీయ అధ్యక్షుడు ఎవరవుతారనే ఉత్కంఠ కాషాయ శ్రేణుల్లో నెలకొంది. స్టేట్ ప్రెసిడెంట్ పోస్టు కోసం చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు రేసులో ఉన్నారు. ఎంపీల్లో రఘునందన్‌రావు, అర్వింద్, ఈటల రాజేందర్, డీకే అరుణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల్లో రాజాసింగ్, పాయల్ శంకర్ పేర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే కొందరు లీడర్లు పార్టీ పెద్దల ఆశీస్సులు పొందాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, పార్టీ అధ్యక్షుడు ఎవరనే అంశంపై అధిష్టానం ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చినట్టు సమాచారం. దీంతో పార్టీ నిర్ణయానికి అనుగుణంగానే ఎలక్షన్స్ జరిగే అవకాశాలు ఉన్నట్టు వినికిడి. పార్టీ డిసైడయిన ఆ వ్యక్తి ఎవరనేది పార్టీలో ఆసక్తిని మరింత పెంచుతోంది. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎవరనే అంశంపై పార్టీ ఈ నెలాఖరు నాటికైనా స్పష్టత ఇస్తుందా? లేదా? అనేది చూడాలి.