తెరపైకి కేబినెట్ విస్తరణ.! ఒకేసారి ఆరు స్థానాల భర్తీకి ప్లాన్

by Shiva |   ( Updated:2024-09-11 04:12:16.0  )
తెరపైకి కేబినెట్ విస్తరణ.! ఒకేసారి ఆరు స్థానాల భర్తీకి ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం మొదలైంది. ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవులను ఒకేసారి భర్తీ చేస్తారనే టాక్ నడుస్తున్నది. ప్రస్తుతం ఫారిన్ టూర్ లో ఉన్న ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ఈ వీకెండ్ లో ఢిల్లీకి చేరుకుంటారు. తెల్లారి లేదా మరునాడు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లి, కేబినెట్ విస్తరణపై రాహుల్ తో చర్చించిన తరువాత తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇంతకాలం పెండింగ్ లో ఉన్న పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఈ మధ్యే క్లియర్ అయింది. దీంతో అధిష్టానం కేబినెట్ విస్తరణపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది.

ఒకేసారి ఆరు పదవుల భర్తీ

ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకుని కేబినెట్ లో 12 మంది ఉండగా, మరో ఆరుగురిని మంత్రులుగా తీసుకోవచ్చు. అయితే ఖాళీగా ఉన్న ఆరు స్థానాలను ఒకేసారి భర్తీ చేయాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. కొన్నింటిని ఖాళీగా ఉంచడం వల్ల ఆ పదవుల కోసం పైరవీలు పెరిగితే అనవసర వివాదాలు తలెత్తుతాయనే అభిప్రాయంలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలలు అవుతున్నది. అయినా పూర్తి స్థాయి కేబినెట్ ను ఏర్పాటు చేయలేకపోయిందనే విమర్శలు ఉన్నాయి. పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పాటు చేస్తే, అడ్మినిస్ట్రేషన్ పై ఫోకస్ పెట్టొచ్చని సీఎం రేవంత్ సైతం భావిస్తున్నట్టు సమాచారం. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు ఎవరిని కూడా మంత్రివర్గంలోకి తీసుకునే చాన్స్ లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆ ఆరు మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొన్నది.

రాహుల్‌తో భేటీ తర్వాతే లిస్టు ఫైనల్

మంత్రి పదవుల కోసం రెడ్డి ఎమ్మెల్యేల మధ్యే తీవ్ర పోటీ ఉంది. ప్రస్తుతం కేబినెట్ లో నలుగురు ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఉండగా, ఈ మధ్య జరిగిన ప్రభుత్వ పదవుల భర్తీలో రెడ్డి లీడర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. దీంతో విస్తరణలో అన్ని వర్గాల వారికి ప్రయారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నది. అందులో భాగంగా కేబినెట్ లోకి ఏయే సామాజిక వర్గం ఎమ్మెల్యేలకు చాన్స్ ఇవ్వాలనే అంశంపై చర్చించేందుకు, ఫారిన్ టూర్ లో ఉన్న రాహుల్ గాంధీ ఢిల్లీకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లి, ఆయనతో చర్చిస్తారని తెలుస్తున్నది. ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. అయితే ఆ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేల్లో అధిష్టానం ఎవరికి ప్రయారిటీ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కేబినెట్ విస్తరణలో రెడ్డిలకు రెండు పదవులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఒక్కొక్క పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతున్నది.

సమస్య అంత నల్లగొండ లీడర్లతోనే?

కేబినెట్ విస్తరణకు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు పెద్ద సమస్యగా మారినట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ జిల్లా నుంచి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు మంత్రులుగా ఉన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుత విస్తరణలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి చాన్స్ ఇస్తారని తెలిసింది. కానీ ఒకే కుటుంబానికి రెండు పదవులు ఎలా ఇస్తారని మంత్రి ఉత్తమ్ అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో ఉత్తమ్ సతీమణి పద్మావతికి అసెంబ్లీ అంచనాల సంఘం చైర్మన్ పదవి ఇచ్చినట్టు చర్చ జరుగుతున్నది. అలాగే ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఎస్టీ ఎమ్మెల్యే బాలు నాయక్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. కానీ ఒకే జిల్లాకు ఎక్కువ మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాదనే ఉద్దేశ్యంతో ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని టాక్ ఉంది.

ఢిల్లీలోనే మకాం వేసిన ప్రేం సాగర్

మంత్రి పదవిని దక్కించుకునేందుకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు కొంతకాలంగా ఢిల్లీలోనే ఉంటూ లాబీయింగ్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి కోసం తీవ్రంగా కష్టపడ్డానని ఆయన ఏఐసీసీ లీడర్లకు వివరిస్తున్నట్టు సమాచారం. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గడ్డం సోదరులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సైతం పోటీ పడుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి వివేక్ కుమారుడు వంశీ ఎంపీగా గెలిచారు. దీంతో ఒకే ఫ్యామిలీకి మూడు పదవులు ఉన్నాయని, మళ్లీ అదే కుటుంబానికి మంత్రి పదవి ఇవ్వొద్దని ఫిర్యాదులు అధిష్టానం వద్ద ఉన్నాయి.

ఆశావాహుల జాబితా

సామాజిక‌వర్గం ఎమ్మెల్యేలు

రెడ్డి సుదర్శన్ రెడ్డి(బోధన్),

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (మునుగోడు)

మల్‌రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీం పట్నం)

Hot News: తెరపైకి కేబినెట్ విస్తరణ.! ఒకేసారి ఆరు స్థానాల భర్తీకి ప్లాన్ రామ్మోహన్ రెడ్డి (పరిగి)

వెలమ ప్రేం సాగర్ రావు (మంచిర్యాల)

మదన్ మోహన్ రావు (ఎల్లారెడ్డి)

బీసీ వాకాటి శ్రీహరి( మక్తల్),

బీర్ల బీర్ల అయిలయ్య (ఆలేరు)

ఎస్సీ వివేక్ (చెన్నూరు),

వినోద్ (బెల్లంపల్లి),

అడ్లూరి లక్ష్మణ్ (ధర్మపురి)

ఎస్టీ బాలు నాయక్ (దేవరకొండ),

రామచందర్ నాయక్ (డోర్నకల్)

మైనార్టీ అమీర్ అలీఖాన్ (ఎమ్మెల్సీ)

Advertisement

Next Story

Most Viewed