- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Mahmood Ali: గ్యాంగ్ రేప్‌లో తన మనువడి ప్రమేయంపై హోం మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్ : Mahmood Ali responds to gang rape incident case| సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ రేప్ ఘటనపై హోం మంత్రి మహమూద్ అలీ స్పందించారు. పబ్ వ్యవహారంలో నా మనవడు ఉన్నాడని కొందరు అసత్య ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అది నిజం కాదని తేలిపోయిందని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ కేసులో పోలీసులు తన పని తాము చేసుకుంటూ వెళ్తున్నారని నిందితులు ఎవరైనా సరే తెలంగాణ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు కొనసాగుతోందని బాధితురాలికి న్యాయం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.
ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకుపై కేసు వేరు.. రాజకీయ సంబంధాలు వేరన్న హోం మంత్రి.. వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి భర్తీ ఆ బోర్డు ద్వారా జరుగుతుందని అతడిని తొలగించే ప్రక్రియ కూడా అదే బోర్డు చేపట్టాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం పిల్లలు అడ్వాన్స్ గా మారిపోయారని ఈ నేపథ్యంలో పిల్లలు, వాళ్ల పెంపకంపై తల్లిదండ్రులు దృష్టిపెట్టాలని సూచించారు. తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబర్ వన్ అని, ఇతర స్టేట్ పోలీసులకు ఆదర్శంగా ఉన్నారని గుర్తు చేశారు. కాగా, అనేక మలుపులు తీసుకుంటున్న ఈ కేసులో తొలుత హోం మంత్రి మనవడి ప్రమేయం ఉందనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే పోలీసులు మాత్రం ఐదుగురు మైనర్లు ఒక మేజర్‌ను అరెస్ట్ చేయడంతో ఈ ఉత్కంఠకు తెరపడింది.
- Tags
- Mahmood Ali