High Court: మూడు నెలల్లో బీసీ కుల గణన పూర్తి చేసి నివేదిక ఇవ్వండి: హైకోర్టు

by Prasad Jukanti |
High Court: మూడు నెలల్లో బీసీ కుల గణన పూర్తి చేసి నివేదిక ఇవ్వండి: హైకోర్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీ కుల గణనపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లో బీసీ కుల గణన పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. బీసీ కులగణన చేయాలని హైకోర్టులో 2019లో బీసీ సంఘం నేత ఎర్ర సత్యనారాయణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను మంగళవారం సీజే ధర్మాసనం విచారించింది. బీసీ కుల గణనపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొన్న పిటిషనర్ తరపున నాగుల శ్రీనివాస్ యాదవ్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ కులగణన చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కోర్టుకు తెలిపారు. దీంతో మూడు నెలల్లో బీసీ కులగణన చేయాలని ప్రభుత్వానికి ఆదేశించిన హైకోర్టు.. ఈ పిటిషన్ పై విచారణ ముగిసిటన్లు ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed