- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బ్రేకింగ్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు హైకోర్టు జడ్జిమెంట్ కాపీ విడుదల
దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తదుపరి విచారణను సిట్ నుండి సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆర్డర్ కాపీ విడుదల అయ్యింది. ఈ ఆర్డర్ కాపీలో హైకోర్టు పలు కీలక విషయాలు ప్రస్తావించింది. సిట్ కేసు దర్యాప్తు సమాచారాన్ని సీఎంకు ఇవ్వడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎంకు సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందని హైకోర్టు పేర్కొంది. దర్యాప్తు ఆధారాలు బహిర్గతం చేయడం వల్ల విచారణ సక్రమంగా జరగదని తెలిపింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయడానికి 45 కారణాలను హైకోర్టు ఆర్డర్ కాపీలో ప్రస్తావించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకి సంబంధించి సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్‌ను కూడా ఈ ఆర్డర్‌లో చేర్చారు. అంతేకాకుండా సిట్ ఉనికిని కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పరిధి దాటి వ్యవహరించిందని.. కోర్టుకు సమర్పించాల్సిన డాక్యుమెంట్లను పబ్లిక్ చేశారని ఆర్డర్ కాపీలో పేర్కొంది. 26 కేసుల జడ్జిమెంట్లను కోట్ చేస్తూ ఈ తీర్పునిచ్చినట్లు హైకోర్టు తెలిపింది.