Encounter Effect: ములుగు జిల్లాలో హై అలర్ట్.. రంగంలోకి SP శబరీష్

by Gantepaka Srikanth |
Encounter Effect: ములుగు జిల్లాలో హై అలర్ట్.. రంగంలోకి SP శబరీష్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్‌కౌంటర్(Encounter) నేపథ్యంలో ములుగు జిల్లాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా కేంద్రంలో పాటు మావోయిస్టు(Maoists) ప్రభావిత ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని ములుగు ఎస్పీ శబరీష్(SP Sabarish) పరిశీలించారు. ఇదిలా ఉండగా.. ములుగు జిల్లా ఏటూరు నాగారం అటవీ ప్రాంతం(Eturnagaram forest area)లో ఆదివారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. చల్పాక అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో మొత్తం ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు.

ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి భద్రు అలియాస్ పాపన్న(Papanna)తో పాటు అతడి దళ సభ్యలు మృతిచెందారు. మృతుల్లో కురుసం మంగు అలియాస్‌ భద్రు అలియాస్‌ పాపన్న (35), ఎగోలపు మల్లయ్య అలియాస్‌ మధు(43), ముస్సకి దేవల్‌ అలియాస్‌ కరుణాకర్‌(22), ముస్సకి జమున (23), జైసింగ్‌ (25), కిశోర్‌ (22), కామేశ్‌( 23) ఉన్నట్లు సమాచారం. అయితే, ఎన్‌కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టుల నుంచి ప్రతీకార చర్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున అన్ని పోలీస్‌ స్టేషన్లను అప్రమత్తం చేశారు.

Advertisement

Next Story