- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఈడీ విచారణకు హాజరైన హీరో నవదీప్

దిశ, డైనమిక్ బ్యూరో: మాదాపూర్ వ్యవహారంలో ప్రముఖ సినీనటుడు నవదీప్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ అతన్ని ప్రశ్నించనుంది. డ్రగ్స్ పెడ్లర్లతో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు అనుమానం ఉండడంతో నవదీప్ బ్యాంకు ఖాతాల వివరాలు, అందులో జరిపిన లావాదేవీలపై లోతుగా ఈడీ విచారించనుంది. గుడిమల్కాపూర్ ఠాణా పరిధిలో ఇటీవల నమోదైన డ్రగ్స్ కేసులో బహిర్గతమైన అంశాల ఆధారంగా ఈనెల 10న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. పోలీసులకు చిక్కిన నైజీరియన్ డ్రగ్‌పెడ్లర్‌తో పాటు తెలుగు సినీ నిర్మాత వెంకటరత్నారెడ్డి, రాంచందర్‌లను విచారించడంతో నవదీప్ పేరు బయటికివచ్చింది. ఈ క్రమంలోనే నవదీప్‌ను కొద్దిరోజుల క్రితం టీన్యాబ్ పోలీసులు విచారణ జరిపారు. తాజాగా టీన్యాబ్ కేసు ఆధారంగా కేసు నమోదుచేసిన ఈడీ దర్యాప్తు చేస్తున్నది.