- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rain alert: మరోసారి దంచి కొట్టనున్న భారీ వర్షాలు
దిశ, వెబ్ డెస్క్: గడిచిన వారం రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు దంచికొట్టాయి. అనంతరం రెండు రోజులపాటు వెనక్కి దగ్గిన వర్షాలు.. మరోసారి తమ ప్రతాపం చూపనున్నట్లు తెలుస్తోంది. గురువారం తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తాజా అలర్ట్ ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే నిర్మల్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ములుగు, హన్మకొండ జనగాం, కామారెడ్డి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.. ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు బోగత వాటర్ ఫాల్స్ ఉగ్రరూపం దాల్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సందర్శకులను వాటర్ ఫాల్స్ వైపు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు.