కాసేపట్లో వర్షం.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం

by Anjali |
కాసేపట్లో వర్షం.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కాగా మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా హైదారాబాదు వాతావరణ శాఖ ఓ కీలక హెచ్చరిక జారీ చేసింది. మరికాసేపట్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు రానున్నాయని సూచించింది. ఈ క్రమంలో రానున్న రెండు గంటల్లో తెలంగాణ రాష్ట్రంలోని మెయిన్ సిటీ అయిన హైదరాబాదు, జగిత్యాల, ఆదిలాబాద్, కామారెడ్డి, ఆసిఫాబాద్, నల్గొండ, మేడ్చల్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు పడుతాయని హైదరాబాదు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

Advertisement

Next Story