HYD : రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-26 03:11:06.0  )
HYD : రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ లో మంగళవారం రాత్రి నుంచి వర్షం దంచికొట్టింది. బుధవారం ఉదయం సైతం వర్షం కురిసింది. ఓ వైపు ఎండలు మండిపోతుండగా మరో వైపు నిన్న ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో వర్షం కురిసింది. నడి వేసవిలో హైదరాబాద్‌లో రికార్డు స్థాయి వర్షపాతం కురిసింది. సిటీలో రెండు గంటల్లో 8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రామచంద్రాపురంలో 7.9 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, గచ్చిబౌలిలో 7.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. గాజులరామారంలో 6.5 సెం.మీ., కుత్బుల్లాపూర్ లో 5.5 సెం.మీ., జీడిమెట్లలో 5.6, లింగంపల్లిలో 4.2 సెం.మీ. వర్షపాతం నమోదు అయింది. కాగా వర్షంతో నగరంలోని రోడ్లన్నీ జలమయ్యాయి. తెలంగాణలో ఉపరితల ద్రోణి కారణంగా నేడు, రేపు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed