- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rain Alert:నగరంలో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్
దిశ, వెబ్‌డెస్క్: నగరవాసులకు బిగ్ అలర్ట్. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఇవాళ(మంగళవారం) సాయంత్రం భారీ వర్షం(Heavy Rain) కురిసింది. ఈ క్రమంలో చాలా ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచింది. రోడ్లన్నీ జలమయం కావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. ఇక పంజాగుట్ట-అమీర్‌పేట రోడ్డు చెరువును తలపిస్తోంది. అంతేకాదు సచివాలయం, ట్యాంక్‌బండ్, లక్డీకాపూల్, హిమయత్ నగర్, ఖైరతాబాద్, బషీర్ బాగ్, అబిడ్స్, నాంపల్లి, కోఠి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట, కేపీహెచ్‌బీ కాలనీ, మూసాపేట, ప్రగతి నగర్, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, షాపూర్ నగర్, సూరారం, బహదూర్ పల్లి, పేట్ బషీరాబాద్, కొంపల్లి, మేడ్చల్, కండ్లకోయ, దుండిగల్, కృష్ణాపూర్, గౌడవెళ్లి, బోయినపల్లి, మారేడ్‌పల్లి, చిలకలగూడ, బొల్లారం, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట, అల్వాల్, జవహర్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని GHMC అధికారులు తెలిపారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.