- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HYD: నగరంలో దంచికొడుతున్న వర్షం.. అయినా కొనసాగుతున్న హనుమాన్ శోభాయాత్ర!
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరం భారీ వర్షానికి తడిసి ముద్దైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, రాంనగర్, రాణిగంజ్, కంటోన్మెంట్ ఏరియాలో వడగండ్ల వాన కురిసింది. పంజాగుట్ట, మలక్ పేట్, హిమాయత్ నగర్, అమీర్ పేట, కోఠి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కుత్భుల్లాపూర్, కొంపల్లి, సూరారం, జీడిమెట్లలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షాల కారణంగా నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మరోవైపు భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల హనుమాన్ శోభాయాత్రకు అంతరాయం ఏర్పడగా మరి కొన్ని చోట్ల వర్షంలోనే శోభాయాత్ర కొనసాగించారు. ఉపరీతల ద్రోణీ కారణంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.