Musi river: మూసీకి భారీగా వరద ప్రవాహం

by M.Rajitha |   ( Updated:2024-09-09 10:32:15.0  )
Musi river: మూసీకి భారీగా వరద ప్రవాహం
X

దిశ, వెబ్ డెస్క్ : మూసీనదికి భారీగా వరద ప్రవాహం పెరుగుతోంది. మూసీ కాలువ అన్నిచోట్ల ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మూసారాంబాగ్ వంతెనపై ప్రమాదకరస్థాయిలో మూసీ ఉప్పొంగుతుండటంతో ట్రాఫిక్ పోలీసులు రాకపోకలు నిలిపి వేశారు. మూసీ నదికి ఎగువ నుండి వచ్చే వరదతో పాటు, నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీలోకి ప్రవాహం ఎక్కువగా ఉంది. ఇక మూసీ పరివాహక ప్రాంతాల్లోని పలు కాలనీల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైయితే తమ నివాసాలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్దంగా ఉండాలని సూచించారు అధికారులు. మరోవైపు హుస్సేన్ సాగర్ కు కూడా వరద ప్రవాహం పెరుగుతుండటంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు.

Advertisement

Next Story

Most Viewed