Chicken Prices Drop : భారీగా తగ్గిన చికెన్ ధరలు.. ఎక్కడో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-07-24 14:19:12.0  )
Chicken Prices Drop : భారీగా తగ్గిన చికెన్ ధరలు.. ఎక్కడో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: హైద్రాబాద్లో చికెన్ ధరలు తగ్గాయి. నెల రోజుల క్రితం స్కిన్‌లెస్ కిలో రూ.280 నుంచి రూ.320 వరకు పలికాయి. అయితే వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఆకాశాన్ని తాకాయి. ఆదివారం స్కిన్‌లెస్ కిలో చికెన్ ధర రూ.200, లైవ్‌ కోడి రూ.130-140 ఉండడంతో ప్రజలు కొనడానికి ఆసక్తి చూపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూరగాయల ధరల కంటే చికెన్ రేటే తక్కువగా ఉండడంతో దుకాణాల వద్ద కొనుగోలుదార్లు, ప్రజలు క్యూ కట్టారు. ఒక కేజీ టమాటా ధర రూ.150 పలుకుతోంది. మార్కెట్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చికెన్‌ రేట్లు తగ్గడంతో ప్రజలు కాస్తా ఊపిరి పీల్చుకున్నారు. టమాట రేట్లు ఎప్పుడు తగ్గుతాయో అని సామాన్యులు ఎదురుచూస్తున్నారు. ఏదయినా కొత్త పంట చేతికి వస్తే కానీ.. రేట్లు తగ్గేలా లేవని రైతుబజార్‌ అధికారులు చెబుతున్నారు.

Advertisement

Next Story