- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TS: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
దిశ, వెబ్‌డెస్క్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకపు అమలును నిలిపివేస్తూ ఇచ్చిన ఉత్తర్వును హైకోర్టు శుక్రవారం మరోసారి పొడిగించింది. తుది ఉత్తర్వులు వెలువడే వరకు గత నెల 30న వెలువరించిన మధ్యంతర స్టేటస్ కో ఉత్తర్వులు అమల్లో ఉంటాయని వెల్లడించింది. ఈ కేసులో కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను ప్రతివాదులుగా చేర్చుతూ దాసోజు శ్రవణ్ కుమార్, కుర్ర సత్యనారాయణ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను హైకోర్టు విచారణకు అనుమతించిన విషయం తెలిసిందే. తదుపరి విచారణ సోమవారం కొనసాగనుంది.
కాగా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా మంత్రివర్గ ఆమోదంతో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్ కుమార్, కుర్ర సత్యనారాయణలను నియమించాలని గత ప్రభుత్వం గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపింది. వారి నామినేషన్లను గవర్నర్ తిరస్కరించింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రోఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్‌ల నియామకానికి గవర్నర్ ఆమోదం తెలిపింది. దీంతో ఈ నియామకాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. తుది తీర్పు సోమవారం వెలువడనుంది.